మోసం కేసులో మహిళకు జైలు

- December 12, 2016 , by Maagulf
మోసం కేసులో మహిళకు జైలు

సోమాలీ మహిళకు ఏడాది జైలు శిక్ష అలాగే, శిక్ష అనంతరం డిపోర్ట్‌ చేయాలంటూ దోహాలోని క్రిమినల్‌ కోర్ట్‌ తీర్పునిచ్చింది. ఓ ట్యాక్సీ డ్రైవర్‌ని వంచించిన కేసులో ఆమెకు ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. దోహాలోని అల్‌ సద్‌ ప్రాంతంలో నిందితురాలు, ఓ ట్యాక్సీని ఆపగా, ఆ ట్యాక్సీ డ్రైవర్‌ ఆమెను గమ్యస్థానానికి చేర్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే తాను ఓ పోలీస్‌ అధికారినని పేర్కొంటూ, కారుకి సంబంధించిన పత్రాలు కావాల్సిందిగా ఆమె డిమాండ్‌ చేసింది. తనవద్దనున్న పత్రాల్ని చూపించిన డ్రైవర్‌ ఇంకొన్ని పత్రాలు, కంపెనీ వద్ద ఉన్నాయని చెప్పగా, అతన్ని బెదిరించి అతని నుంచి 400 ఖతారీ రియాల్స్‌ని కాజేసింది. అనంతరం వేరే ప్రాంతానికి కారుని పోనిచ్చి, అక్కడ ఆమె దిగిపోయింది. ట్యాక్సీ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కేసు విచారించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి, న్యాయస్థానానికి తరలించారు. అయితే తొలుత తాను ఆ నేరం చేయలేదని నిందితురాలు ఎదురుతిరిగినా, చివరకు నేరం ఒప్పుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com