బేబీ డైపర్లలో 16 కిలోల బంగారం....!
- December 12, 2016
అక్రమార్కులు చివరికి బేబీ డైపర్లు ను కూడా వదలడం లేదు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో బేబీ డైపర్లలో దాచి అక్రమంగా రవాణా చేస్తున్న 16 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణీకులనుంచి 16 కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు కనుగొన్నారు. ఆరుగురు ప్రయాణికులతో కూడిన బృందం దుబాయ్ నుంచి ఇక్కడకు చేరుకున్నారు. తమతో పాటు తీసుకొస్తున్న ఇద్దరు పిల్లల డైపర్లలో ఈ బిస్కట్లను చాలా తెలివిగా దాచి పెట్టారు. అయితే తనిఖీల్లో అధికారులు చాకచక్యంగా వాటిని పట్టుకొన్నారు. కిలో బరువున్న పదహారు బంగారు బిస్కెట్లను రెండు గ్రూపుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.వీరిలో సూరత్ కు చెందిన దంపతులు కూడా ఉన్నారన్నారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







