దుబాయ్ - షార్జా రూట్లో యాక్సిడెంట్, అగ్నికీలలు
- December 13, 2016
దుబాయ్ నుంచి షార్జా వెళ్ళే దారిలో షేక్ జాయెద్ రోడ్డుపై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిస్సాన్ సలూన్, మిట్సుబిషి పజెరోని వెనుకనుండి ఢీకొన్న కాస్సేపట్లోనే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నుంచి రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లు క్షేమంగా బయటపడ్డారు. తగలబడిన నిస్సాన్ వాహనాన్ని సివిల్ డిఫెన్స్ సిబ్బంది తొలగించి, ట్రాఫిక్ని క్లియర్ చేశారు. గ్రాండ్ మిడ్వెస్ట్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ రోడ్లో తాను ప్రయాణిస్తుండగా, తగలబడిపోతున్న కారుని చూసినట్లుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







