కేరళ శాసనసభ స్పీకర్ ను సన్మానించిన శలాలహ్ భారతీయ సామాజిక క్లబ్
- December 14, 2016
మస్కట్ : కేరళ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ ను శలాలహ్ భారతీయ సామాజిక క్లబ్ (ఐ ఎస్ సి) ఇటీవల ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని శలాలహ్ భారతీయ సామాజిక క్లబ్ మరియు దాని మలయాళ విభాగం సంయుక్తంగా నిర్వహించారు. వివిధ సామాజిక సాంస్కృతిక సంస్థలు నుండి క్లబ్ సభ్యులు మరియు ప్రతినిధులు ఈ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరవ అతిధిని చైర్మన్ మన్ప్రీత్ సింగ్ పుష్ప గుచ్చంతో వేదికపైకి ఆహ్వానించారు మరియు బంగారు శాలువాని ఆయనపై కప్పి ఒక జ్ఞాపీకను అందించారు. సంయుక్త కార్యదర్శి వినయ్ కుమార్ అధికారికంగా కేరళ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ ను సాదరంగా స్వాగతించారు. ఆయన జీవితం మరియు సాధించిన ఘట్టాలను ప్రముఖంగా సభకు తెలిపారు. మలయాళ విభాగం కన్వీనర్ డాక్టర్ నిస్తారు మరో జ్ఞాప్తికను అందజేశారు. ఇతర ప్రతినిధులు సైతం వారి సంస్థల తరపున పలు జ్ఞాప్తికలను అతిథికి అందచేశారు. . శ్రీరామకృష్ణన్ భారత సమాజం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడంపై ఈ సందర్భంగా చైర్మన్ మరియు నిర్వహణ కమిటీ సభ్యులు ప్రశంసించారు.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







