కొత్త భవనాల్లో ఎల్‌పిజి బ్యాన్‌!

- December 14, 2016 , by Maagulf
కొత్త భవనాల్లో ఎల్‌పిజి బ్యాన్‌!

దుబాయ్‌: కొత్తగా అప్‌డేట్‌ చేసిన యూఏఈ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోడ్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ ప్రకారంగా చూస్తే కొత్తగా నిర్మించే భవనాల్లో కుకింగ్‌ గ్యాస్‌ సిలిండర్లు పూర్తిగా నిషేధం. ఓ సీనియర్‌ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్ని ప్రమాదాల్ని నివారించేందుకోసం ఈ నిబంధనను తెరపైకి తెచ్చినట్లు చెప్పారు. కొత్త భవనాలు సెంట్రలైజ్డ్‌ గ్యాస్‌పైప్‌ నెట్‌వర్క్‌ని కలిగి ఉంటాయి. అలాంటి భవనాల్లో మళ్ళీ కుకింగ్‌ గ్యాస్‌ సిలెండర్ల వాడకం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇబ్రహీమ్‌, ఈ మేరకు డ్రాఫ్ట్‌ రూపకల్పనకు నాయకత్వం వహించారు. సివిల్‌ డిఫెన్స్‌ అప్పుడే ఈ నిబంధనను అమలు చేసే దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ కొత్త కోడ్‌ ఈ నెల చివరి నాటికి అమల్లోకి వస్తుంది. అయితే పాత భవనాల్లోనూ ఈ నిబంధనలు అమలు చేయడం కొంతవరకు ఇబ్బందికరమనీ, ప్రస్తుత సంప్రదాయ సిలెండర్ల స్థానంలో లైట్‌ వెయిట్‌తో కూడిన సిలెండర్లను ఉపయోగించడం వల్ల ప్రమాదాల్ని కొంతవరకు తగ్గించవచ్చునని దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌లో సీనియర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రమోద్‌ చల్లా అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com