కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 467 మంది కార్మికులు

- December 14, 2016 , by Maagulf
కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 467 మంది కార్మికులు

మస్కట్ : డిసెంబర్ 4 వ తేదీ నుంచి 10 వ తేదీ మధ్య కాలంలో 467 మంది కార్మికులు కార్మిక చట్టంను ఉల్లంఘించారని మానవ వనరుల మంత్రిత్వశాఖలోని లేబర్ ఇన్స్పెక్టర్లు కేసులను నమోదు చేశారు, వీరిలో 344 మంది వాణిజ్య కార్మికులు, 53 మంది వ్యవసాయ కార్మికులు మరియు 70 గృహ సంబంధిత కార్మికులు ఉన్నారు. ఈ తనిఖీల సందర్భంగా, 434  మంది  కార్మికులను అరెస్టు చేశారు. వీటిలో, 281  మంది కనబడకుండా పారిపోయినవారు కాగా, 135 మంది తగ్గించబడిన కార్మికులు  మరియు ౧౮ మందికి పని చేసే పత్రాలు కల్గిలేకపోవడం చేత వీరిని అదుపులో తీసుకొన్నారు. ఇదే సమయంలో అత్యధికంగా కార్మికుల దొరికిన ప్రాంతం మస్కట్ కాగా ఇక్కడ 134 మంది దొరికేరు. ఆ తర్వాత ఉత్తర బతినః లో 122 మంది పట్టుబడ్డారు. వీరందరిపై చట్టపరమైన చర్య తీసుకొనేందుకు అధికారులు ఉపక్రమిస్తున్నారు. మరోవైపు, మంత్రిత్వ శాఖ ఇదే కాలంలో 417 మంది కార్మికులను దేశం నుంచి పంపించివేసింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com