పతంజలి ఆయుర్వేద కంపెనీకి జరిమానా ...
- December 14, 2016
యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీకి హరిద్వార్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు జరిమానా విధించింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, తప్పుడు ప్రకటనల ద్వారా వినియోగదారులను పక్కదోవ పట్టించిందన్న అభియోగాలు నిరూపణ కావడంతో రూ.11 లక్షలు జరిమానాగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇతర సంస్థలు తయారు చేసిన వస్తువులను తమ బ్రాండ్ పేరిట ప్రకటనల్లో పేర్కొని వినియోగదారులను పక్కదోవ పట్టించి ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ చూస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 52, 53 కింద తప్పుడు ప్రకటనలు, వినియోగదారులను పక్కదోవ పట్టించడం వంటి నేరాలతో పాటు ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని నేరం కింద జరిమానా విధిస్తూ..నెల రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆహార నాణ్యత ప్రమాణాల శాఖను ఆదేశించింది.
2012 ఆగస్టు 16న నిర్వహించిన ఆహార భద్రతా ప్రమాణ పరీక్షల్లోపతంజలి వస్తువులు విఫలం కావడంతో అదే ఏడాది నవంబర్‌లో ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి ఈ నెల 1న తీర్పు వెలువడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







