అమరావతి చుట్టూ నాలుగు జాతీయ రహదారులు..
- December 14, 2016
అమరావతి నిర్మాణం, అభివృద్ధిపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. అమరావతికి అన్ని ప్రాంతాల నుంచీ సులభంగా చేరుకునేలా రహదార్లు వేయాలని సంకల్పించి ప్రభుత్వం.. కనెక్టివిటీ పెంపు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కేపిటల్ చుట్టూ ఉన్న పట్టణాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అటు సర్కులర్ ట్రెయిన్లకు లెక్కలు రూపొందించారు. విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు. అక్కడి నుంచి విజయవాడ వయా తెనాలి. Map అమరావతికి కనెక్టివిటి పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమిది. సర్కులర్ ట్రైన్‌కు ప్రణాళిక రూపొందించారు. సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మార్గం 105 కిలోమీటర్లు ఉంటుంది. దీని నిర్మాణానికి 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. సర్కులర్ ట్రెయిన్ పట్టాలెక్కితే.. అమరావతికి చేరుకోవడం మరింత సులభం అవుతుందని అధికారులు చెప్తున్నారు.
నెల్లూరు, ఒంగోలు నుంచి అమరావతికి రావాలంటే.. తెనాలిలో దిగితే సరిపోతుంది. అక్కడి నుంచి సర్కులర్ ట్రైన్ ఎక్కొచ్చు. అలాగే.. సీమ జిల్లాల నుంచి గుంటూరు.. అక్కడి నుంచి సర్కులర్ రైలు. విజయవాడ నుంచి ఉద్యోగుల రాక సులభం అవుతుంది. అంతేకాదు.. రాజదానికి నిమిషాల్లో చేరుకునే వీలు కలుగుతుండడంతో.. సిబ్బంది కేవలం విజయవాడ, గుంటూరులోనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోను వసతి ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కలగనుంది. రాజధాని చుట్టూ నాలుగు జాతీయ రహదారులను కలుపుతూ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సీఆర్‌డీఏ పరిధిలోని పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా నిర్మాణం వుండాలని.. రెండు రోజుల్లోగా దీనిపై ప్రణాళికలు ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారాయ. రహదారులకు సంబంధించి సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ 3 ఆప్షన్లను సీఎం ముందు ఉంచారు. తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నై-కోల్‌కతా, విజయవాడ-ముంబై, విజయవాడ-జగదల్‌పూర్ నేషనల్ హైవేలతో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్-వేకి అనుసంధానంగా ఉండేలా ఔటర్ రింగ్ రోడ్డు వుండనుంది. రానున్న కాలంలో రాజధాని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్స్ అభివృద్ధి చెందుతాయని సీఎం అన్నారు. ఔటర్ రోడ్‌పై తుది ప్రణాళిక సిద్ధమైతే ఈ నివేదికను తయారు చేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు.
రాజధాని పరిధిలోని రెండు ప్రధాన నగరాలు, చుట్టూ వుండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్‌షిప్‌లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందని సీఎం అధికారులకు చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి రాజధానికి దారితీసే అంతర్గత రోడ్లన్నీ మలుపులు లేకుండా వుండాలని సూచించారు. అమరావతి నిర్మాణంతో పాటే చుట్టూ వున్న తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, తాడేపల్లి వంటి ప్రాంతాల్లో సమాంతర అభివృద్ధి జరగాలని, ఆ దిశగా ఇప్పటినుంచే ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







