ఒమన్‌లో ఎయిర్ కండిషన్డ్ బస్ స్టాప్స్
- December 15, 2016
వింటర్ ముగిసేనాటికి మూడు ఎయిర్ కండిషన్డ్ బస్ స్టాప్స్ మవసలాత్ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని సంస్థ సీనియర్ అధికారులు చెప్పారు. ఒమన్‌లో మూడు ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్‌ని ప్రారంభించాలనుకుంటున్నామనీ, వీటిల్లో రెండు అల్ ఖువైర్‌లో ఉంటాయని మవసలాత్ సిఇఓ అహ్మద్ బిన్ అలి అల్ బలుషి చెప్పారు. ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ రీబ్రాండెడ్ వెర్షన్‌గా పిలవబడ్తున్న మవసలాత్, 3.6 మిలియన్ ప్రయాణీకుల్ని 2015 నవంబర్ 22 నుంచి నేటిదాకా గమ్యస్థానాలకు చేర్చించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్ షెల్టర్స్ సక్సెస్ అయితే, ఇంకా మరికొన్నిటిని నిర్మిస్తామని సంస్థ ప్రకటించింది. మవసలాత్ ప్రయాణీకులు ఈ సరికొత్త ఏసీ బస్ షెల్టర్స్ రాకపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలంలో తమకు ఈ షెల్టర్స్ ఎంతో ఉపకరిస్తాయని వారు అంటున్నారు. 2017లో మవసలాట్ 118 కొత్త బస్సుల్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 నిమిషాల వరకు ప్రతి 15 నిమిషాలకు ఖచ్చితంగా ఓ బస్సు ప్రయాణీకులకు అందుబాటులో ఉటోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







