క్యుపర్టినో మేయర్‌గా భారత మహిళ సవితా వైద్యనాథన్
- December 16, 2016
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వున్న క్యుపర్టినో పట్టణానికి తొలిసారిగా భారత సంతతికి చెందిన సవితా వైద్యనాథన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. యాపిల్ సంస్థ ప్రధాన కార్యాలయం క్యుపర్టినోలో ఉండటంతో ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. మేయర్‌గా ఎన్నికైనందుకు సవిత సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో అద్భుతమైన క్షణాలు ఇవేనంటూ ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందిన చిన్నపట్టణాల్లో క్యుపర్టినో ప్రముఖమైనది. 19 సంవత్సరాలుగా క్యుపర్టినోలో నివసిస్తున్న సవిత అక్కడి పలు కమ్యూనిటీలు నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఎంబీఏ చదివిన ఆమె హైస్కూల్ మ్యాథ్స్ టీచరుగా, కమర్షియల్ బ్యాంకులో అధికారిగా పనిచేశారు. మేయర్‌గా తొలి సంతకం ఆమె విద్యకు సంబంధించిన ప్రకటన మీదే చేయడం విశేషం. గత వారం జరిగిన సవిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి ఆమె తల్లి బయల్దేరి వెళ్లారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







