విజయవాడలో 'ఖయ్యూం భాయ్'
- December 16, 2016
బెజవాడలోని కృష్ణవేణి మోటెల్ వద్ద గురువారం 'ఖయ్యూం భాయ్' చిత్ర షూటింగ్ జరిగింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చిత్రీకరణ జరుపుతున్న మొదటి చిత్రం ఇది. ఇటీవల సంచలనం సృష్టించిన డాన్ నయీం ఉదంతంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజధాని మందడం ప్రాంతానికి చెందిన కట్టా రాంబాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా ఖయ్యూం (నయీమ్) పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాకు తారకరత్న పోలీసు అధికారిగా చేస్తున్నారు. రాజా చెయ్యి వేస్తే, మనమంతా, ఎవరు వంటి వరుస సినిమాల తర్వాత తారకరత్న గ్యాంగ్‌స్టర్ కథాంశంతో కూడిన చిత్రంలో నటిస్తున్నారు. తారకరత్న సరసన ఇద్దరు హీరోయిన్లు ప్రియాంక, హర్షితలు నటిస్తున్నారు. సంచలన చిత్రాలు తీసిన డైరెక్టర్ భరత ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్స్‌ను ఏరిపారేయాలన్న సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు డైరెక్టర్ ఆంధ్రజ్యోతికి చెప్పారు. అమరావతి రాజధానిలో పూర్తి నిడివితో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం ఇది. దాదాపుగా 24 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ రాజధాని ప్రాంతంలో వేర్వేరు చోట్ల జరగనున్నాయి. ఈ సినిమా పతాక సన్నివేశాలు బెజవాడ చుట్టుపక్కల జరుపుతున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నాని తదితరులు తమకు అన్ని విధాలా సహకారం అందించారని నిర్మాత కట్టా రాంబాబు ఆంధ్రజ్యోతికి చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







