'వైరస్'గా మారుతున్న సంపూర్ణేష్ బాబు
- December 17, 2016
హృదయలేయం, సింగం 123 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంపూర్ణేష్ బాబు హీరోగా పుల్లారేవు రామచందర్ రెడ్డి సమర్పణలో ఎ.యస్.ఎన్.ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో సలీం ఎం.డి. శ్రీనివాస్ మంగళ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `వైరస్`. `నో వ్యాక్సిన్ ఓన్లీ ట్యాక్సిన్` ట్యాగ్‌లైన్. గీత్‌షా, నిధిషా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా...చిత్ర నిర్మాతలు సలీం ఎం.డి. శ్రీనివాస్ మంగళ మాట్లాడుతూ - ``సంపూర్ణేష్ బాబు హీరోగా `వైరస్` సినిమాను మా బ్యానర్లో రూపొందించడం ఎంతో ఆనందంగా ఉంది.భయానక బీభత్స కామెడి మర్డర్ మిస్టరీ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సంపూ వైరస్ `నో వ్యాక్సిన్ ఓన్లీ ట్యాక్సిన్` ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంపూర్ణేష్‌బాబు తనదైన నటనతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు. మీనాక్షి భుజంగ్ సంగీతం, సునీల్ కశ్యప్గారి రీరికార్డింగ్, వి.జె సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. సినిమా ఫస్ట్‌లుక్‌ను త్వరలో విడుదల చేస్తున్నాం`` అన్నారు.
సంపూర్ణేష్‌బాబు, గీత్‌షా, నిధిషా, వెన్నెలకిషోర్, వైవా హర్ష, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః మీనాక్షి భుజంగ్, రీ రికార్డింగ్ః సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీః వి.జె, ఎడిటింగ్ః మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాతలుః సలీం ఎం.డి. శ్రీనివాస్ మంగళ, దర్శకత్వంః ఎస్.ఆర్.కృష్ణ.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









