కీర్తీ సురేష్ తో విశాల్
- December 17, 2016
కీర్తి సురేష్.. కీర్తీ టాలీవుడ్, కోలీవుడ్ లోనూ పెరిగిపోయింది. 'నేను శైలజ'తో తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్స్ సినిమాల ఆఫర్లని కొట్టేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోనూ హీరోయిన్ ఎంపికైంది.
ఇప్పటికే కోలీవుడ్ లో కీర్తి సురేష్ హవా మొదలైంది. అక్కడ ఇదు ఎన్న మాయం, రజనీమురుగన్, రెమో చిత్రాలు చేసింది. ఇప్పుడు తమిళ్ స్టార్స్ విజయ్, సూర్య చిత్రాలలో నటిస్తోంది. విజయ్-కీర్తి సురేష్ జంటగా నటించిన 'భైరవా' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోణ్న 'తానా సేర్న్‌దకూట్టం' చిత్రంలో సూర్యకి జంటగా నటిస్తోంది కీర్తి సురేష్.
ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కనున్న 'సండైకోళి-2' చిత్రం కోసం కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైంది.టాలీవుడ్, కోలీవుడ్ లోనూ నాలుగేసి సినిమాలతో బిజీ అయిపోయింది కీర్తి సురేష్. ఈ సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకొస్తే.. కీర్తీ స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయమంటున్నారు. కీర్తీ సురేష్ నానితో చేసిన 'నేను లోకల్', తమిళ్ స్టార్ విజయ్ తో చేసిన 'భైరవా' రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







