అల్ షామల , సుహైల్ , అల్ తుమమ మూడు కొత్త పార్కులు వచ్చే వారం ప్రారంభం
- December 18, 2016
నేడు జాతీయ దినోత్సవం సందర్భంగా అల్ షామల, సుహైల్ మరియు అల్ తుమమ అనే మూడు కొత్త పార్కులు ప్రారంభిస్తున్నట్లు మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ వద్ద పబ్లిక్ పార్క్లు శాఖ మరియు పర్యావరణ శాఖ తెలిపింది. ఈ మూడు కొత్త ప్రజా పార్కులలో ఒకటి కుటుంబాలు కోసం కేటాయించారు. ఈ పార్కులో వినోద, క్రీడా సౌకర్యాలు మరియు పిల్లలకు ఆట స్థలాలతో సహా అన్ని అవసరమైన సౌకర్యాలు అమర్చారు. వై-ఫై ఇంటర్నెట్ సౌకర్యం ఈ పార్కులలో అందుబాటులో లేదు.మంత్రిత్వశాఖలోని పబ్లిక్ పార్క్లు శాఖ డైరెక్టర్ మహమ్మద్ అల్ ఖూరి మాట్లాడుతూ, సుహైల్ పార్కు మరియు అల్ తుమమ పార్కులు సోమవారం నుంచి ప్రారంభమవుతుందని అలాగే అల్ షామల పార్క్ మంగళవారం నుంచి ప్రజల కోసం అందుబాటులో ఉంటాయని చెప్పారు. గతంలో మంత్రిత్వశాఖలోని ఒక అధికారిక దోహా మరియు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎనిమిది కుటుంబ ప్రజా పార్కులలో ఉచిత వి -ఫై అమర్చారు. ఆ తర్వాత మరిన్ని పార్కులలో ఉచిత వి -ఫై సౌకర్యం వచ్చే ఏడాది కల్పించనున్నట్లు ' మా గల్ఫ్ డాట్ కామ్ " ఆయన తెలిపారు. అదేవిధంగా ఉచిత వి -ఫై త్వరలో అల్ షామల, అల్ సుహైల్ మరియు అల్ షామల అల్ లుక్ట , న్యూ ఒనైజా , ఐన్ ఖలేద్ అల్ జుబైలాస్ , అల్ రువాయ్స్ రిసార్ట్ పార్కులు వద్ద అందుబాటులో ఉంటుందని అన్నారు.వి -ఫై కనెక్షన్ ప్రజా పార్కుల్లో ఇప్పటికే అందుబాటులో ఉందని అవి డల్ అల్ హమాం పార్క్, అల్ దఫన పార్క్, అల్ వక్ర పబ్లిక్ పార్క్, అల్ ఖోర్ కార్నిచ్కు సీమాయస్మా పార్క్, అల్ షహానియా ఉద్యానవనం, మరియు ఆలీ బిన్ జస్సిమ్ పార్కులు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







