మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో కర్ఫ్యూ
- December 18, 2016
మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఆదివారం హింసాత్మక ఘటనలతో అట్టుడికింది. ప్రజాసంఘాలిచ్చిన బంద్ సందర్భంగా ఉవ్వెత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నాగా తెగలు విధించిన ఆర్థిక దిగ్బంధనం, ఉగ్రదాడులకు నిరసనగా ఈ బంద్ జరిగింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు నాగా జిల్లాల కొండప్రాంతాల నుంచి ఇంఫాల్‌కు వస్తున్న పలు వాహనాలపై దాడులు చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. ఒక బస్సును నేరుగా నదిలోకి తోసేశారు. అయితే ఈ హింసాత్మక ఘటనల్లో ఎవరూ మరణించినట్టు వార్తలు అందలేదు. మణిపూర్‌లో నవంబర్ నుంచి నాగా ఆదివాసీ తెగలు కొనసాగస్తున్న ఆర్థిక దిగ్బంధనంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంధనం, మందులు సహా నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. గత గురువారం మూడు బాంబు పేలుళ్లు సంభవించగా, శుక్రవారం రాత్రి అతి పురాతన బాప్టిస్ట్ చర్చిపై దాడి జరిగింది. దీంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. శనివారం సైతం నాగా టెర్రరిస్టులుగా అనుమానిస్తున్న 70 మంది పోలీస్ పోస్ట్‌పై దాడి చేసి తొమ్మిది ఆటోమాటిక్ వెపన్స్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. తాజాగా ఆదివారం బంద్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలతో నేపాల్ ఈస్ట్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







