చైనా ఉక్కిరిబిక్కిరి
- December 18, 2016
చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దేశంలోని 40 నగరాలను కాలుష్య భూతం కమ్మేసింది. ఉత్తర చైనాలోని 23 నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వీటిలో బీజింగ్, టియాంజిన్ కూడా ఉన్నాయి. మరో 17 నగరాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితి రానున్న రెండు మూడు రోజుల్లో మరింత క్షీణించవచ్చని జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. పొగ చుట్టేయడంతో టియాంజిన్ నుంచి వెళ్లవలసిన 35 విమానాలను రద్దు చేశారు. ఏమీ కనిపించని పరిస్థితి తలెత్తడంతో ఈ నగరానికి చేరుకునే దారులను మూసేశారు. బీజింగ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 253కు చేరడం అక్కడి కాలుష్య తీవ్రతను సూచిస్తోంది. పర్యావరణ పరిరక్షణ శాఖ 13 తనిఖీ బృందాలను వివిధ ప్రాంతాలకు పంపింది. అనుమతలు లేని పరిశ్రమలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.
తాజా వార్తలు
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక
- భారత్-స్విట్జర్లాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
- సౌదీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు.. ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- క్రాస్ బార్డర్ నేరాలపై GCC దేశాల మధ్య మరింత సహకారం..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు.. కారణాలపై హోం మినిస్ట్రీ కీలక ప్రకటన..!!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డెలివరీ సంస్థలపై చర్యలు..!!
- పర్యావరణ చట్టం.. బిల్లుపై చర్చించిన ఒమన్ షురా కౌన్సిల్..!!
- ఫుజైరాలో బావిలో పడిన చిన్నారి, డొమెస్టిక్ వర్కర్ సేఫ్..!!







