ఓకే బంగారం:రివ్యూ
- April 18, 2015
తారాగణం: దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, ప్రకాష్‌రాజ్, లీలా సాంసన్ తదితరులు
చాయాగ్రహణం: పి.సి.శ్రీరాం
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాణం: మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: దిల్ రాజు, మణిరత్నం
విడుదల తేదీ: 17 ఏప్రియల్ 2015
కథ
వైవాహిక జీవితం మీద అవగాహన లేని యువతీ యువకులు, వైవాహిక బంధంలో వున్న గొప్పతనం ఎరిగిన ఆదర్శ దంపతులనుంచి ఏం నేర్చుకున్నారు? అనే కథాంశంతో సినిమా రూపొందింది. ఆది (దుల్కర్ సల్మాన్)కి ముంబైలో తార (నిత్యామీనన్) పరిచయమవుతుంది. ఇద్దరూ సహజీవనం చేయాలనుకుంటారు. గణపతి (ప్రకాష్‌రాజ్), భవానీ (లీలా శాంసన్) దంపతులు. వీరితోలతో కలిసి ఓ ఇంట్లో సహజీవనం చేస్తారు ఆది, తార. కొన్నాళ్ళ సహజీవనం తర్వాత ఎవరి కెరీర్‌ని వెతుక్కుంటూ వారు విదేశాలకు వెళ్ళిపోదామనుకుంటారు. సహజీవనంతోనే తార, ఆదిల కలయిక ముగుస్తుందా? వైవాహిక బంధం వరకూ వారి పరిచయం వెళుతుందా? అనేది మిగతా కథ. అది తెరపై చూస్తేనే బాగుంటుంది.
నటీనటుల ప్రతిభ
మణిరత్నం సినిమాల్లో నటీనటులు తమ ప్రతిభను సానపెట్టుకోడానికి ఆస్కారముంటుంది. దుల్కర్ సల్మాన్‌కి ఆ గొప్ప అవకాశం దక్కింది. నేటితరం యూత్‌కి నచ్చేలా మంచి ఫీచర్స్ కలిగి ఉన్నాడు దుల్కర్. నటనతో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా స్టైలిష్‌గా కూడా కనిపించాడు. నిత్యామీనన్ సినిమా సినిమాకీ నటనలో మేటి అనిపించుకుంటూనే ఉంది. మణిరత్నం చేతిలో పడ్డంతో నిత్యామీనన్ నటనలో ఇంకా మెరిసిపోయింది.
గణపతి పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయాడు. కాదు కాదు జీవించాడని చెప్పడం సబబుగా ఉంటుంది. ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ పాత్ర చాలా కీలకం. అంత కీలకమైన పాత్రలో ప్రకాష్‌రాజ్ జీవించి, కథకు వెయిట్ పెంచాడు. లీలా శాంసన్ పేషెంట్‌గా కనిపించినా బాగానే చేసింది. మిగతా పాత్రల్లో కనిపించిన నటీనటులు తమ వరకూ న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు
సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన బలం. సినిమా అందంగా, రిచ్‌గా కనిపించింది. మణిరత్నం సినిమాల్లో కెమెరా పనితనం గొప్పగా ఉంటుందనే అభిప్రాయం ఉంది ప్రేక్షకుల్లో. దానికి ఈ సినిమా ఇంకో ఉదాహరణగా నిలుస్తుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్, హైలైట్ పాయింట్ కూడా. నేపథ్య సంగీతం సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఇంకొచెం అవసరమనిపిస్తుంది, సినిమా స్లో అయ్యిందనిపించే సీన్స్ వస్తున్నప్పుడు. ఆర్ట్, కాస్ట్యూమ్స్ బాగా కుదిరాయి.
విశ్లేషణ
తెలియని కథ అయితే కాదు. కానీ అందంగా చూపిస్తే, సినిమాల్లో ప్రేక్షకులు లీనమయ్యేలా కథ చెపితే ఆడియన్స్ సినిమా చూస్తున్నంతసేపూ అందులోని పాత్రలను తమ జీవితంలో ఎదురయ్యే పాత్రలతో పోల్చుకుని, ఓ మంచి ఫీల్‌కి గురవుతారని మణిరత్నం రూపొందించిన ఎన్నో సినిమాలు నిరూపించాయి. అందులో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది. తొలి సగం సాఫీగా సాగిపోతే, రెండో సగంలో ఫీల్ ఎక్కువగా ఉంటుంది. తమ మధ్య ఉన్న సంబంధం ప్రేమ అని తెలిశాక హీరో హీరోయిన్లు తమలో తామే అనుభవించే సంఘర్షణ స్క్రీన్‌పైనుంచి ఆడియన్స్‌ని తల తిప్పుకోనివ్వదు. సినిమా మొత్తం చూశాక ఫీల్ గుడ్ సినిమా చూశామన్న అభిప్రాయంతో ఆడియన్స్ బయటకు వస్తారు.
ఫైనల్ కామెంట్
మంచి ఫీల్ ఉంది బంగారం
మాగల్ఫ్.కాం రేటింగ్: 3.25/5
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







