ఒమాన్ లోనికి ప్రవేశించే నిర్వాసిత మహిళలకు నూతన వీసా నిబంధనలు

- December 21, 2016 , by Maagulf
ఒమాన్ లోనికి ప్రవేశించే నిర్వాసిత మహిళలకు నూతన వీసా నిబంధనలు

మస్కట్ : కొన్ని దేశాలకు చెందిన మహిళా అవివాహిత జాతీయులను ఇకపై పర్యాటక వీసాలతో ఒమాన్ లోనికి ప్రవేశింపనీయరు. తిరిగి వెళ్లే విమాన టికెట్ ఒకవేళ వారి వద్ద లేకపోతే కనీసం ఒక 4 నక్షత్ర హోటల్ లో బుక్ చేయడానికి అనుమతించబడరని రాయల్ ఒమన్ పోలీస్ తెలిపారు. కొన్ని దేశాలకు చెందిన మహిళా ఆసియా పర్యాటకుల పర్యాటక వీసా మంజూరుని నిరోధిస్తున్నామని పేర్కొంటూ, వారిపై పలు మానవ రవాణా, వ్యభిచారం, మాదకద్రవ్యాలు, దూషణ తదితర నేరాలతో సంబంధం ఆరోపణలు ఉన్నకారణంగా మరింత నియంత్రణలను రాయల్ ఒమన్ పోలీస్ అమలు చేస్తోంది.కొత్త నిబంధనల ప్రకారం వీసా పొడవు గరిష్టంగా తగ్గించబడ్డాయి. పది రోజులు మాత్రమే ఉంటుంది.ఆ దేశాలకు చెందిన జాతీయులు వారు తిరిగి వారి దేశాలకు వెళ్లిన ఒక నెల తర్వాత మరొక పర్యాటక వీసా అనుమతి లేదు.మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే , ఒమాని చట్టం ప్రాకారామ్ ఎవరైనా వ్యభిచారం కేసులో దొరికితే  కనీసం మూడు నెలల నుంచి మూడేళ్ల జైలుశిక్ష తప్పనిసరిగా అమలుచేయనున్నారు. అంతేకాక 20 ఒమాన్ రియాల్స్ నుంచి  మరియు 100 ఒమాన్ రియాల్స్ మధ్య జరిమానాసైతం ఉంటుంది. అదేవిధంగా శిక్ష వేశ్యాగృహాలను నిర్వహించినా లేదా అసాంఘిక కార్యక్రమాలకు సహాయపడిన ఎవరికైనా ఈ శిక్షలు వర్తిస్తాయి. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com