మరోసారి 'నిర్భయ్' క్షిపణి విఫలం
- December 21, 2016
అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నిర్భయ్ క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైంది. ఈ ప్రయోగం విఫలమవడం ఇది మూడోసారి. ఒడిశాలోని బాలాసోర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని బుధవారం ప్రయోగించారు. భూ ఉపరితలంపై వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా రూపొందించిన ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మూడో వేదిక నుంచి ప్రయోగించగా.. నిర్దేశిత మార్గంలో ఇది వెళ్లలేదని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకూ నాలుగు ప్రయోగాలు చేపట్టగా మూడు విఫలమయ్యాయి.మార్చి 2013లో మొదటిసారి నిర్భయ్ క్షిపణి ప్రయోగం చేపట్టగా అది పూర్తిగా విఫలమైంది. అక్టోబర్ 2014లో చేపట్టిన రెండో ప్రయోగం విజయవంతమైంది. అయితే నిర్దేశించిన 800 కి.మీ లక్ష్యానికి బదులు ఇది 1,010 కి.మీ ప్రయాణించింది. అక్టోబర్ 2015న చేపట్టిన మూడో ప్రయోగం, ఇవాళ చేపట్టిన నాలుగో ప్రయోగం పూర్తిగా విఫలమయ్యాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







