రాంగోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం!
- December 21, 2016
రాంగోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. చెప్పినమాటకు ఏనాడూ కట్టుబడి ఉండని వర్మ, తగుదునమ్మా అంటూ డైరెక్టర్లందర్నీ పిలిచి అట్లతద్దెమాదిరి హైదరాబాద్ లో వంగవీటి సినిమా ప్రమోషన్ చేసి వాయినాలిచ్చాడు. అదే సమయంలో దీన్ని మళ్లీ మాటమార్చేందుకు వేదికగా చేసుకున్నాడు. డైరెక్టర్లలో ప్రస్తుత పెద్దముత్తైదువ రాజమౌళితో ఇకనుంచి మంచి సినిమాలు చేస్తానంటూ చల్లగా చెప్పేశాడు. దీంతో డైరెక్టర్లంతా ఒక్కసారిగా అవాక్కై.. తర్వాత నవ్వుకున్నారు. ఇదిలాఉంటే, వంగవీటి సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో వర్మ, ఇదే తన లాస్ట్ తెలుగు సినిమా అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
మరో అడుగుముందుకేసి..ఎందుకంటే, ఇంతకంటే గొప్పకథ తనకు ఇక జీవితంలో దొరకదంటూ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు మళ్లీ 'శివ' సినిమాకి సీక్వెల్ తీస్తానంటున్నాడు. ఇప్పుడేకాదు, గోవిందా గోవిందా సినిమా దగ్గరనుంచీ వర్మ గోవిందలు కొట్టడం మొదలెట్టాడు. అప్పట్లో ఇక తెలుగులో సినిమాలు చేయనంటూ సెన్సార్ బోర్డు మీద అలకబూనిన వర్మ, తర్వాత్తర్వాత మాట మార్చి మళ్లీ తెలుగుసినిమాలు చేయడం మొదలెట్టాడు. ఇలా ఎన్నో అంశాలైపోయాయి.
అన్నిచోట్లా వర్మ కుండమార్పిడే. ఇకఇది వర్మ వాల్యూమ్ 99 అన్నమాట. ఇంకొక్క మాట మారిస్తే సెంచరీ కొట్టేస్తాడు. ఓ పక్క వర్మ అభిమానులుకూడా ఇది లాస్ట్ సినిమా అనుకొని ఓ కంక్లూజన్ కు వచ్చిన తరుణంలో మళ్లీ తగుతునమ్మా అనుకుంటూ డైరెక్టర్లందర్నీ పేరంటానికి పిలిచినట్టు పిలిచి మళ్లీ సినిమా చేస్తానని చెప్పి..
పెద్దముత్తైదువుకి మాటిచ్చాడు. మొత్తానికి వర్మ యవ్వారం తీసుకోవమ్మా..వాయినం..పుచ్చుకుంటినమ్మ వాయినం లా తయారైంది అంటున్నాయి గణపతికాంప్లెక్స్ వర్గాలు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







