పురుషులపై ఆధారపడను అంటున్న.. గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా!

- December 21, 2016 , by Maagulf
పురుషులపై ఆధారపడను అంటున్న.. గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా!

త న ప్రతిభతో హాలీవుడ్‌లోనూ అవకాశాలను సంపాదిస్తూ గ్లోబల్‌స్టార్‌గా ఎదుగుతోంది బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా. త్వరలోనే తన తొలి హాలీవుడ్‌ చిత్రం 'బేవాచ్‌' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ఇటీవల భారత్‌కి తిరిగొచ్చిన ప్రియాంకని గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాక.. చుట్టూ ఉండేవాళ్ల ప్రవర్తనలో ఏమైనా మార్పుని గమనించారా? అని అడిగితే ఆసక్తికరమైన సమాధానమిచ్చింది.
''అలాంటి విషయంపై ఇంతవరకు శ్రద్ధ పెట్టలేదు. దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టం ఉండదు. అలాగే ఫేమస్‌ కావాలని ఇండస్ట్రీకి రాలేదు.

అనుకోకుండా గుర్తింపు వచ్చింది. కానీ ఫేమస్‌ అవ్వడం కంటే నటిగా విజయాన్ని సాధించినప్పుడే సంతృప్తి చెందుతా. ఈ క్రమంలో ఎవరి మీద ఆధారపడను. మనది పురుషాధిక్య సమాజం.

కాబట్టి మహిళలు ఎలాంటి భయం లేకుండా ప్రయత్నించినప్పటికీ చివరకి పురుషుల మీదనే ఆధారపడుతుంటారు. కానీ నేను అలా కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నన్ను పురుషులతో సమానంగా పెంచారు. కాబట్టి పురుషుల మీద ఆధారపడకుండా ఏదైనా సాధించగలననే నమ్మకం ఉంది.

అలాగే గతంలో సాధించిన విషయాలను తలచుకుంటూ విశ్రాంతి తీసుకోవడం అంటే నాకు నచ్చదు. ఎప్పుడూ తర్వాత ఏం చేయాలనే దానిపైనే నా ఆలోచన ఉంటుంది.'' అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com