బడా బాబుల అరెస్ట్‌లు..పలుచోట్ల భారీగా కొత్త నోట్లు..

- December 22, 2016 , by Maagulf
బడా బాబుల అరెస్ట్‌లు..పలుచోట్ల భారీగా కొత్త నోట్లు..

పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు  మార్పిడి ముఠాల ఆగడాలు పెద్ద ఎత్తున బయట పడుతున్నాయి. కొందరికి కోట్లలో కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. పోలీస్, ఐటీ దాడుల్లో కొత్త నోట్లు భారీగా బయటపడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో 20 లక్షల 31 వేల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అటు చెన్నై ఎయిర్ పోర్టులో కోటీ 34 లక్షల రూపాయల విలువైన నోట్లను పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కోల్ కతాలో బడా హవాలా దళారి పారస్ మాల్ లోధాను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆయన్ని పట్టుకున్నారు.  టీడీపీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి మనీ లాండరింగ్ లో లోధా సహకరించాడని , 25 కోట్ల రూపాయల మార్పిడికి సహాయం చేశాడని అధికారులు తెలిపారు. చెన్నైలో ట్రెజరీ సెక్రటరీ నాగరాజన్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు, ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి నుంచి 31 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com