“మా టీవీ” తెలుగులో నెం 1 ఎంటర్తైన్మెంట్ నెట్ వర్క్ గా ఎదిగింది

- September 06, 2015 , by Maagulf
“మా టీవీ”  తెలుగులో నెం 1 ఎంటర్తైన్మెంట్ నెట్ వర్క్ గా ఎదిగింది

తెలుగులో అనాది కాలంలోనే చాలా పాపులర్ అయిన “మా టీవీ” దినదినాభివృద్ది చెందుతూ తెలుగులో నెం 1 ఎంటర్తైన్మెంట్ నెట్ వర్క్ గా ఎదిగింది. అయితే ఇప్పుడు ఈ చానెల్ ని స్టార్ ఇండియా నెట్ వర్క్ సొంతం చేసుకుంది. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన డీల్ లో స్టార్ గ్రూప్ సంస్థ మా టీవీని సుమారు 2500 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మా టెలివిజన్ నెట్ వర్క్ లో నిమ్మగడ్డ ప్రసాద్ కు 65% ,మెగా ఫ్యామిలీకి 20% ,అక్కినేని నాగార్జునకు 10% , రిటైల్ ఇన్వెస్టర్లకు 5% శాతం వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాటాల ప్రకారం 20% ఉన్న మెగా ఫ్యామిలీ కి రూ.500 కోట్లు, 10% ఉన్న నాగార్జునకు రూ.250 కోట్లు, 65% వాటా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కు రూ.1625 కోట్లు, 5% ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.125 కోట్లు త్వరలోనే వాటా దారులకు చెందనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com