లిబియాలో విమానం హైజాక్‌

- December 23, 2016 , by Maagulf
లిబియాలో విమానం హైజాక్‌

లిబియాలో ఓ విమానం హైజాక్‌ అయ్యింది. ఆఫ్రిక్వియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎ-320 విమానం 118 ప్రయాణికులతో సబ ఎయిర్‌పోర్టు నుంచి ట్రిపోలికి వెళ్తుండగా హైజాకర్లు దారి మళ్ళించారు. మల్దీవుల్లోని మాల్టా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఫ్లైట్‌లో ఇద్దరు హైజాకర్లు ఉన్నట్లు.. మల్టా ప్రధాని ప్రకటించారు.  హైజాకర్ల దగ్గర ఆయుధాలు, హ్యాండ్‌ గ్రనైడ్లు ఉన్నట్లు సమాచారం. విమానాన్ని పేల్చేస్తాని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విమానం హైజాక్‌కు గల కారణాలు వెల్లడించలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంత వరకు హైజాక్‌ చేసినట్లు ప్రకటన చేయలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com