నీలి చిత్రాలు, సెక్స్ ట్రేడ్ కోసం...
- December 23, 2016
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఐక్యరాజ్యసమితికి చెందిన మాదక ద్రవ్యాలు, నేరాల నిరోధక కార్యాలయం (యూఎన్ఓడీసీ) విడుదల చేసిన ఓ నివేదికలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. వ్యభిచారం కోసం, నీలి చిత్రాల నిర్మాణం కోసం, వెట్టిచాకిరి కోసమే కాకుండా గనుల మైనింగ్ కార్యకలాపాల్లో బానిసల్లా పనిచేసేందుకు, ప్రైవేటుసైన్యంలో, టెర్రరిస్టుల తరఫున పోరాడేందుకు మానవులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మాఫియా ముఠాల తరఫున బిచ్చగాళ్లుగా మారేందుకు కూడా మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నారంటే వళ్లు జలదరిస్తుంది.
ఓ దేశంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే కాకుండా, ఓ దేశం నుంచి మరో దేశానికి, ఓ ఖండం నుంచి మరో ఖండానికి కూడా ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది.
ఇలా రవాణా అవుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు పిల్లలే ఉంటున్నారు. మొత్తం అక్రమ రవాణాలో 28 శాతం పిల్లలు ఉంటున్నారు. ఇక మహిళలు, బాలికలను కలుపుకొంటే 71 శాతం మంది ఉన్నారు. మహిళలను, బాలికలను సెక్స్ ట్రేడ్‌లోకి దించుతున్నారు, నీలి చిత్రాల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. బాలలను ఎక్కువగా బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. యువకులను మైనింగ్‌లో పోర్టర్లుగా, వెట్టిచాకిరి కార్మికులుగా, ప్రైవేట్ సైనికులుగా అమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా రవాణా అవుతున్న 28 శాతం పిల్లల్లో సబ్ సహారా ఆఫ్రికా, మధ్య అమెరికా, కరేబియన్ ప్రాంతాలకు చెందిన పిల్లలే 62 నుంచి 64 శాతం ఉంటున్నారు.
2012 నుంచి 2014 ఏళ్ల మధ్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగిన మానవ అక్రమ రవాణా వివరాలను సేకరించి ఈ నివేదికను రూపొందించినట్లు యూఎన్ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యూరి ఫెదదోవ్ తెలిపారు. ఉద్యోగాలు, మంచి జీతాలు ఇప్పిస్తామనే మాయమాటలకు కొంతమంది అమాయకులు బుట్టలో పడుతుండగా, పిల్లల్లో ఎక్కువ మంది కిడ్నాప్‌లకు గురవుతున్నారని ఆయన తెలిపారు. మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు 2003 నాటికి ప్రపంచంలోని 18 శాతం దేశాల్లో కఠినచట్టాలు అమల్లో ఉండగా, నేడు 88 శాతం దేశాల్లో కఠినచట్టాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ చట్టాల కింద శిక్షలు మాత్రం తక్కువే పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2030 సంవత్సరం నాటికి మానవ అక్రమ రవాణాను గణనీయంగా అరికట్టాలనే లక్ష్యాలను సాధించాలంటే ఇలాంటి కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు కఠిన శిక్షలు విధించాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







