ఫుట్‌బాల్ అభిమానులు చేయాల్సినవి....చేయకూడని తెలిపిన ఆంతరంగిక మంత్రిత్వ శాఖ
- December 23, 2016
చేయాల్సినవి....చేయకూడని విధి విధానాలను ఒక సవివర జాబితాని ఫుట్‌బాల్ అభిమానులకు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (మోయి ) జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం జస్సిమ్ బిన్ హమద్ స్టేడియంలో జరగనున్న జువెంటస్ మరియు ఏ సి మిలన్ మధ్య ఇటాలియన్ సూపర్ కప్ (అల్ సాద్ స్టేడియం) హాజరుకానున్న ఫుట్‌బాల్ అభిమానులకు సూచిందారు. ప్రేక్షకులు సులభంగా ప్రవేశించడానికి నిర్ధారించడానికి మరియు గేట్లు వద్ద రద్దీని నివారించేందుకు మ్యాచ్ ప్రారంభానికి తగినంత ముందే స్టేడియం చేరుకోవడానికి సలహా ఇచ్చారు. తుపాకులు, పేలుడు సామగ్రీ , కత్తులు, గాజు, ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటి వస్తువులు అలాగే మాదకద్రవ్యాలు, మద్యం, ధూమపానం ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా అనుమతించబడదని నివేదించింది.రాజకీయ మరియు మతపరమైన నినాదాలు, హానికర వాగుళ్ళు లేదా అసంబద్ధం చిత్రాలు, విడ్డూరమైన పిలుపులు సైతం అనుమతించబడవు. అలాగే స్టేడియంలోనికి పెంపుడు జంతువులు, హెల్మెట్లు, గొడుగుల ప్రవేశాన్ని సైతం నిషేధించారు. ప్రేక్షకులు సెక్యూరిటీ సిబ్బందితో సహకరించాలని మరియు అవసరమైనప్పుడు వారి సహాయం పొందాలని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







