టర్కీ విమాన దాడుల్లో 88 మంది సాధారణ పౌరులు మృత్యువాత..
- December 23, 2016
ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న సిరియా పట్టణం అల్ బాబ్‌పై టర్కీ దళాలు 24 గంటలు పాటు జరిపిన విమాన దాడుల్లో 88 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడ్డారు. గురువారం నాటి దాడుల్లో 72 మంది మృతి చెందగా.. శుక్రవారం కూడా కొనసాగిన ఆ దాడుల్లో మరో 16 మంది చనిపోయారని మానవ హక్కుల సంఘం ప్రకటించింది. ఆగస్టు నుంచి మొదలైన టర్కీ దాడుల్లో ఇదే అతిదారుణమైనదని పేర్కొంది.
తమ జవాన్లను చంపిన ఐసిస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ ప్రకటించిన తర్వాత.. గురువారం ఆ ఉగ్రసంస్థ మరో ఇద్దరు టర్కీ జవానులను సజీవంగా తగలబెట్టిన వీడియో ఒకటి విడుదల చేసింది.సిరియా దళాల చేతుల్లోకి అలెప్పో..రెబెల్స్‌కు కీలకమైన పట్టణంగా ఉన్న అలెప్పోపై సిరియా దళాలు పూర్తి పట్టు సాధించాయి.
ప్రజలు కూడా తమ ఇళ్లకు తిరిగి వచ్చి శిథిలమైన వాటిని గుర్తిస్తున్నారు. సివిల్ వార్ మొదలైన తర్వాత అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఇదే అతిపెద్ద విజయం
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









