భారత్ అగ్ని-5 మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది..
- December 26, 2016
ఆర్మీ అమ్ముల పొదిలో చేరేందుకు అత్యంత శక్తివంతమైన మరో అస్త్రం సిద్ధమైంది. సుదూర లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణి అగ్ని-5ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ (వీలర్ ఐలాండ్) నుంచి ఉదయ 10 గంటలకు అగ్ని5 దూసుకెళ్లింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి 6వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల ఈ మిస్సైల్‌ను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయడం విశేషం.
కాగా అగ్ని5 మిస్సైల్‌ను ప్రయోగించడం ఇది నాలుగోసారి. తొలిసారి 2012 ఏప్రిల్ 19న ప్రయోగించగా... 2013 సెప్టెంబర్ 15న రెండోసారి ప్రయోగించారు. చివరిసారిగా గతేడాది జనవరి 31న ప్రయోగించారు.
అగ్ని-5 క్షిపణి మొత్తం 17 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో ప్రయోగదశలో 50 టన్నుల బరువు ఉంటుంది. దాదాపు 1.5 టన్నుల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యంతో దీనిని రూపొందించారు. నావిగేషన్, మార్గనిర్దేశం, ఇంజిన్, వార్‌హెడ్ పరంగా అగ్ని 5 మిస్సైల్‌ను ఇంతకు ముందుకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్టు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తరహా మిసైళ్లు అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ ఇంగ్లండ్ దేశాలవద్ద మాత్రమే ఉన్నాయి.
అగ్ని 5 అందుబాటులోకి వస్తే చైనా సహా ఆసియా, యూరోప్, ఆఫ్రికాలోని పలు దేశాలపైనా గురిపెట్టవచ్చు. దీంతో అగ్ని5ను భారత గేమ్ చేంజర్‌గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే భారత్ వద్ద శక్తివంతమైన అగ్ని 1,2,3,4 సిరీస్ బాలిస్టిక్ మిసైళ్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. చైనా తయారు చేసిన డీఎఫ్-26 మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిసైల్‌కు అగ్ని-5 మిసైల్‌తో భారత్ గట్టి సమాధానం ఇచ్చినట్టు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







