ఛారిటీ బాక్స్‌ దొంగతనం..

- December 27, 2016 , by Maagulf
ఛారిటీ బాక్స్‌ దొంగతనం..

17 ఏళ్ళ అరబ్‌ జాతీయుడు షార్జాలోని ఓ మాస్క్‌లో దొంగతనం చేసిన కేసులో అరెస్టయ్యాడు. ఛారిటీ బాక్స్‌ నుంచి 250 దిర్హామ్‌లు నిందితుడు దొంగిలించాడు. షార్జా కోఆపరేటివ్‌ సొసైటీకి చెందిన ఛారిటీ బాక్స్‌ అది. నిందితుడితోపాటు మరికొందరు, ఇతర ఛారిటీ బాక్స్‌లనూ దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. షార్జాలోని అల్‌ నబ్బా ఏరియాలో అబ్దుల్లా బిన్‌ ఒమర్‌ బిన్‌ అల్‌ ఖతాబ్‌ మాస్క్‌లో దుహ్ర్‌ ప్రార్థనల అనంతరం నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు మాత్రం తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని చెబుతున్నాడు. ఇంకో వైపున నిందితుడ్ని ఛారిటీ బాక్స్‌ వద్ద తాను చూసినట్లు క్లీనింగ్‌ వర్కర్‌ ఒకరు న్యాయస్థానానికి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com