కొత్త జీవితంలోకి క్షమాభిక్ష పొందిన ఖైదీలు..
- December 27, 2016
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ అల్ ఖాసిమి, 180 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందులో వివిధ దేశాలకు చెందిన ఖైదీలు ఉన్నారు. ఈ విషయాన్ని షార్జా పోలీస్ ఉన్నతాధికారి 'వార్షిక జిజిజి యునిఫైడ్ ఇన్‌మేట్స్' వీక్‌లో ప్రకటించారు. క్షమాభిక్ష పొందిన 20 మంది ఖైదీల డెబిట్స్‌ని షార్జా ఛారిటీ అసోసియేషన్ భరిస్తోంది. ఇంకో వైపున 13 మంది ఖైదీలకు డెంటల్ ట్రీట్‌మెంట్‌ని షార్జా చారిటీ చేయిస్తోంది. జోర్డాన్‌కి చెందిన ఉమ్ మొహమ్మద్ అనే మహిళ తన కుమారుడికి క్షమాభిక్ష లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. క్షమాభిక్ష పొందిన ఖైదీలు ఇకపై సాధారణ పౌరుల్లా జీవించాలని ఆకాంక్షించారు. ఖైదీలు జైలు జీవనం గడిపిన సమయంలో వారి నడవడిక, అలాగే ఆయా వ్యక్తులు అంతకు ముందు చేసిన నేరాల్ని పరిగణనలోకి తీసుకుని, వారికి క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. ఇంకో వైపున ఖైదీల కుటుంబాలకు పలు బహుమతుల్ని, గిఫ్ట్ వోచర్స్‌ని షార్జా కో-ఆపరేటివ్ సొసైటీ అందించింది. ఎలక్ట్రానిక్ డివైజెస్, హోమ్ అప్లయెన్సెస్ - ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ ద్వారా బహుమతుల రూపంలో అందాయి.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







