'ఎయిర్ ఇండియా' వారి న్యూఇయర్ ఆఫర్
- December 27, 2016
న్యూఇయర్ లోకి అడుగుపెడుతున్న తరుణంలో నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాలలో న్యూఇయర్ స్కీమ్ కింద వన్-వే ఎకనామిక్ క్లాస్ టిక్కెట్లు రూ.849కే అందించనున్నట్టు తెలిపింది. దీనిలోనే అన్ని చార్జీలను కలిపి ఉంటాయని పేర్కొంది. 2016 డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ ను ఎయిర్ ఇండియా అందుబాటులో ఉంచనుంది. 2017 జనవరి 15 నుంచి 2017 ఏప్రిల్ 30 వరకు ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తించనుంది. చెన్నై-కోయంబత్తూర్, బెంగళూరు-హైదరాబాద్ మార్గాలలో వన్ వే చార్జీ రూ.849కు అందుబాటులో ఉంచుతున్నట్టు తన వెబ్ సైట్ లో పొందుపరిచింది.
ఈ న్యూఇయర్ సేల్ కింద కవర్ అయ్యే మార్గాలు బెంగళూరు-చెన్నైకు రూ.1,199, ముంబాయి-గోవా రూ.1,499, ముంబాయి-బెంగళూరుకు రూ.1,599, శ్రీనగర్-ఢిల్లీకి రూ.1,999కు టిక్కెట్ ధర ఉండనుంది.
ఇతర మార్గాలు గోవా-ఢిల్లీకు రూ.2,999, గోవా-చెన్నైకు రూ.2,199 టిక్కెట్ ధరలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా ప్రకటించిన న్యూఇయర్ ఆఫర్ కేవలం ఎంపికచేసిన సెక్టార్స్ పై ఎకనామిక్ క్లాస్ లో వన్-వే ప్రయాణాలకు మాత్రమే వర్తించనుంది. గ్రూప్ బుకింగ్స్ కు ఇది వర్తించదని ఎయిర్ ఇండియా తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







