భారత్ రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై
- December 27, 2016
నాటికి దేశంలోని దాదాపు 400 రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవల కేరళలోని కొల్లం రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై ఏర్పాటు చేయటంతో 2016లో ఏర్పాటు చేసిన వాటి సంఖ్య 100కు చేరిందని తెలిపారు. అయితే 2017లో 400 స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
'ముంబయి స్టేషన్ నుంచి మొదలు పెట్టి.. దక్షిణ భాగంలో కొల్లం స్టేషన్ వరకు ఉచిత వైఫై సదుపాయం కల్పించాం. దీంతో ఈ ఏడాది గూగుల్ సహాయంతో రద్దీగా ఉండే 100 రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లయింది.
వచ్చే ఏడాది 400 మేజర్ స్టేషన్లలో ఈ సదుపాయం కల్పిస్తాం' అని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు.
2016 జనవరిలో రైల్వే శాఖ ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సదుపాయాన్ని ప్రారంభించింది. అది మొదలుకొని భువనేశ్వర్, బెంగళూరు, హౌరా, కాన్పూర్, మథుర, అలీగఢ్, బరేలీ, వారణాసి తదితర స్టేషన్లలో ఈ సదుపాయం కల్పించింది. దీంతో దాదాపు కోటి మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్లో వైఫైని ఉపయోగించుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు వారికి కావాల్సిన పుస్తకాలు, గేమ్స్, సమాచారాన్ని క్షణాల్లో పొందుతున్నారని రైల్వే అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







