భారత్ రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై

- December 27, 2016 , by Maagulf
భారత్  రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై

నాటికి దేశంలోని దాదాపు 400 రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవల కేరళలోని కొల్లం రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై ఏర్పాటు చేయటంతో 2016లో ఏర్పాటు చేసిన వాటి సంఖ్య 100కు చేరిందని తెలిపారు. అయితే 2017లో 400 స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
'ముంబయి స్టేషన్‌ నుంచి మొదలు పెట్టి.. దక్షిణ భాగంలో కొల్లం స్టేషన్‌ వరకు ఉచిత వైఫై సదుపాయం కల్పించాం. దీంతో ఈ ఏడాది గూగుల్‌ సహాయంతో రద్దీగా ఉండే 100 రైల్వేస్టేషన్‌లలో వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లయింది.
వచ్చే ఏడాది 400 మేజర్‌ స్టేషన్లలో ఈ సదుపాయం కల్పిస్తాం' అని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు.
2016 జనవరిలో రైల్వే శాఖ ముంబయి సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సదుపాయాన్ని ప్రారంభించింది. అది మొదలుకొని భువనేశ్వర్‌, బెంగళూరు, హౌరా, కాన్పూర్‌, మథుర, అలీగఢ్‌, బరేలీ, వారణాసి తదితర స్టేషన్లలో ఈ సదుపాయం కల్పించింది. దీంతో దాదాపు కోటి మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో వైఫైని ఉపయోగించుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు వారికి కావాల్సిన పుస్తకాలు, గేమ్స్‌, సమాచారాన్ని క్షణాల్లో పొందుతున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com