2017 జనవరి 9 వ తేదీన కువైట్ లో 'ప్రవాస భారతీయ దివస్'
- December 27, 2016
ప్రతి సంవత్సరం జనవరి 9 వ తేదీన ప్రవాస భారతీయ దివస్ ను జరుపుకుంటారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనికి చారిత్రకంగా గుర్తిస్తూ ఈ తేదికి అత్యంత ప్రాధాన్యం ఉంది. 2003 నుండి, భారతదేశం ప్రభుత్వం భారతదేశం లో ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తుంది. సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రవాస భారతీయ సమాజం భారతదేశం అభివృద్ధిలో సహకారం గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. కువైట్ నివసిస్తున్న భారతీయులు భారతదేశం మరియు కువైట్ దేశాల మధ్య అన్ని రంగాల్లో పెరుగుతున్న సంబంధాల పెంపులో వారి ఘనమైన పాత్రను పోషిస్తున్నారు. ఆ సందర్భానికి గుర్తుగా, " ప్రవాసి భారతీయ దివస్ 2017 " భారతదేశం యొక్క రాయబార కార్యాలయం ఆడిటోరియం వద్ద జనవరి 9 వ తేదీ సోమవారం 2017 ( 'రీడిఫైనింగ్ ఎంగేజ్మెంట్ ఇండియన్ డయాస్పోరా) అనే అంశం కింద నిర్వహించనున్నారు. ప్రవాస భారతీయులందరు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పి ఐ ఓ మరియు ఓ సి ఐ కార్డుదారులకు మరియు కువైట్ లో ఉన్నవారి స్నేహితులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ డయాస్పోరా కు సంబంధించిన సమస్యలపై అర్ధవంతమైన చర్చలో పాల్గొనేందుకు రావాల్సిందిగా కోరారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







