సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టుతున్న వైద్య బృందం !!
- September 08, 2015
ప్రపంచంలోనే తొలిసారి మానవ తల మార్పిడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చైనా, ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ సాహసం చేయనున్నారు. ఈ మార్పిడి ప్రక్రియను రష్యాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తపై చేపట్టనున్నారు. ఈ కంప్యూటర్ శాస్త్రవేత్త మాస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రయోగం విజయవంతమైతే చికిత్సలేని వైద్య సమస్యల్ని తగ్గించడం ద్వారా మానవ చరిత్రలోనే భారీ మార్పులు తీసుకొస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేషన్‌ను హార్బిన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఇటలీ వైద్యనిపుణుడు సెర్జియో కానవెరో, చైనా సర్జన్ రెన్ క్సియోపింగ్‌లు సంయుక్తంగా చేపట్టనున్నారు. కాగా, తొలి హెడ్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ 1970లో అమెరికన్ న్యూరోసర్జన్ రాబర్ట్ వైట్ చేపట్టారు. ఈయన కోతి తలను మార్పిడి చేపట్టారు. ఈ ఆపరేషన్ తర్వాత కోతి చనిపోయింది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ ఆపరేషన్‌ను తిరస్కరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







