ఒమన్ సంస్థ యజమానికి 6 నెలల జైలుశిక్ష , 20 వేల ఓ ఎం ఆర్ జరిమానా..
- December 28, 2016
ఒమాన్ లోని ప్రసిద్ధ హోటళ్లలో మరియు షాపింగ్ మాల్స్ నందు గడువు తీరిన ఆహారపదార్ధాలు అమ్మకం జరుగుతుందన్నవిషయం కనుగొన్న తర్వాత ఒక క్యాటరింగ్ సంస్థ మూసివేయబడిందని వినియోగదారుల పరిరక్షణ ప్రజా సంస్థ నివేదించింది. మానవ వినియోగంకు పనికిరాని నెలల క్రితం పాడైన కాలవ్యవధి దాటిపోయినా ఆహారాన్ని పంపినే చేస్తున్నట్లు ఆ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
బౌషెర్ కంపెనీ ఆహార పదార్ధాలు నిల్వ ఉంచే స్థలంలో ఆకస్మిక తనిఖీలు జరిపిన పి ఎ సి పి అధికారులు ప్రవాసీయుల వద్ద "పెద్ద సంఖ్యలో" కుళ్ళిన చేపలు, మాంసం, నూనె మరియు జున్నుతో సహా 4,000 రకాల గడువు తీరిన ఆయా ఉత్పత్తులను తిరిగి వాడుకలో తీసుకువస్తూ వ్యాపారం చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ తనిఖీలో సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం లోపల ఒక ఆఫీసు ఉండగా పాత తేదీలు తొలగించి వాటి స్థానంలో కొత్త నకిలీ తేదీలు అతికిస్తూ ఆయా వస్తువులపై ఉపయోగిస్తూ ఒక పరికరంను అధికారులచే కనుగొనబడింది. సుల్తనత్ పరిధిలో ప్రముఖ హోటళ్లు మరియు దుకాణాలకు ముందుగా సిద్ధం చేసిన రెడీమేడ్ భోజనం అందించటానికి ఈ పాడైన ఆహార పదార్ధాలను బౌషెర్ కంపెనీ ఉపయోగించిందని పి ఎ సి పి అధికారులు పేర్కొన్నారు. సంస్థ యజమానికి ఆరు నెలల కారాగార శిక్షతో పాటు 20,000 ఒమాన్ రియాళ్ళు జరిమానా విధిస్తూమరియు గడువు తీరిన ఉత్పత్తులను నాశనం చేయాలని ప్రాధమిక కోర్టు ఆదేశించింది .
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







