షార్జాలో భారతీయుని హత్య కేసులో అనుమానితుడు అరెస్ట్..
- December 29, 2016
- శరీరం పై పలు కత్తిపోట్లు... దుకాణం లోపల మృతదేహం లభ్యం
షార్జా: స్థానిక మైసూన్ ప్రాంతంలో ఒక దుకాణం లోపల శరీరం పై పలు కత్తిగాట్లతో చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహం షార్జ పోలీసుల చేత కనుగొనబడింది.ఈ మరణంకు కారణం మరొక వ్యక్తి ప్రమేయం ఉందని నమ్మకంతో పోలీసులు ఒక అనుమానిత వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ దారుణ హత్యకు గురైన వ్యక్తి 52 ఏళ్ల భారతీయుడిగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి యొక్క శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయని మంగళవారం ఉదయం తన స్వంత కిరాణా దుకాణం లోపల అతని మృతదేహం కనుగొనబడింది. అనుమానితుడితో ఒక ఆర్ధిక వివాదం కారణంగా 52 ఏళ్ల భారతీయ వ్యక్తి హతమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన విషయంపై వారి మధ్య జరిగిన ఒక చర్చ హింసాత్మక ఘర్షణకు దారితీసింది. దీంతో నిందితుడు బాధితుడుపై కత్తితోదాడి చేసి విచక్షణారహితంగా కత్తితి పొడిచి చేయడంతో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు.కాగా మంగళవారం ఉదయం హతుడ్ని కనుగన్నతర్వాత షార్జా పోలీసులు భారతీయుడిని హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడానికి 12 గంటల కంటే తక్కువ సమయంలోఅనుమానితుదీని అదుపులోనికి తీసుకొన్నారు, పోలీసు పెట్రోల్, పారామెడిక్స్ మరియు సిఐడి నుండి ఒక జట్టు సంఘటన స్థలానికి తరలించబడింది మరియు వారు కత్తిపోట్లకు గురైన బాధితుడి జీవితం రక్షించడానికి వారు ఎంతో ప్రయత్నించారు.హంతకుడిని సత్వరమే అరెస్ట్ చేసి కేవలం గంటల వ్యవధిలోనే పోలీసు బృందం చేసిన ప్రయత్నాలపై షార్జా పోలీస్ కార్యకలాపాలు డైరెక్టర్ కల్నల్ మహ్మద్ రషీద్ బయటి ప్రశంసల జల్లు కురిపించారు ఈ కేసుని షార్జా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించేవారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







