హజ్ యాత్రీకులకు హెచ్. ఎం. సి., కతార్ వారి ఆరోగ్య హెచ్చరిక
- September 08, 2015
హజ్ యాత్రీకులు, ప్రయాణం ప్రారంభం అయే ముందు, ప్రయాణంలోను మరియు యాత్ర చివరిదశలోనూ కూడా ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవలసిందిగా హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్. ఎం. సి) వారు హెచ్చరించారు. ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ - డా. సాద్ అల్ నువైమీ, వైరస్ వల్ల వచ్చే శ్వాస సంబంధిత రుగ్మతలైన గొంతు, శ్వాస కోస మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు సమూహాల వల్ల వేగంగా వ్యాప్తిస్తాయని, దగ్గినపుడు, తుమ్మినపుడు టిష్యూ పేపర్లను వాడడం, వాడిన వాటిని జాగ్రత్తగా పారవేయడం, చేతులను సబ్బు మరియు నీటితో తరచుగా శుభ్రం చేసుకోవడం, చేతితో - కంటిని, ముక్కును మరియు నోటిని వీలైనంత వరకు తాకకుండా ఉండడం వంటి చిన్న చిన్న చర్యల ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉన్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, హజ్ యాత్ర ముగిసిన అనంతరం తల నీలాలు సమర్పించేపుడు ఒకరు వాడిన బ్లేడును వాడకుండడం కూడా ముఖ్యమన్నారు. ఏదైనా అనారోగ్యం ఏర్పడినపుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సహకారం పొందాలని సూచింధారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









