పొగమంచుతో యూఏఈలో రవాణా సమస్యలు..
- December 29, 2016
యూఏఈలో ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ కారణంగా పలు విమానాల రాకపోకలకు ఇబ్బందలు తలెత్తుతున్నట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మొత్తం 107 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు దుబాయ్ పోలీసులు గురువారం వెల్లడించారు. మొత్తం 1,164 ఫోన్ కాల్స్ ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి వచ్చినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఏడు విమానాల క్యాన్సిలేషన్, అలాగే 9 విమానాల డైవర్షన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి జరిగినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు. పొగమంచు కారణంగా తలెత్తుతున్న ఈ పరిస్థితుల పట్ల విమాన ప్రయాణీకులకు కలుగుతున్న ఇబ్బందికి తాము చింతిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







