న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధం..
- December 29, 2016
దుబాయ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి పోలీసు వ్యవస్థ పరంగా తాము సర్వసన్నద్ధంగా ఉన్నట్లు దుబాయ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరి మాట్లాడుతూ, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ విభాగం పూర్తి అలర్ట్‌గా ఉన్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఈవెంట్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ సలెమ్ ఖలీఫా అల్ రుమైతి చెప్పారు. పలు పెట్రోలింగ్ యూనిట్స్, 470 స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఫోర్స్‌ని భద్రత కోసం వినియోగిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. 901 హాట్‌లైన్ ద్వారా అన్ని పోలీసులూ ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







