సెంట్రల్ మార్కెట్ తరలింపుతో అసౌకర్యం..
- December 29, 2016
వెజిటబుల్, ఫిష్ మరియు క్యాటిల్ మార్కెట్స్‌ని దోహా సెంట్రల్ మార్కెట్ నుంచి వక్రా, సైలియా, ఉమ్ సలాల్ అలి ప్రాంతాలకు కొద్ది నెలల్లో తరలించనుండడంతో వినియోగదారులకి, అలాగే వ్యాపారులకు సమస్యలు తెచ్చిపెట్టనున్నాయి. తాత్కాలిక ఇబ్బందులే అయినా వీటి కారణంగా తలెత్తే అసౌకర్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకేసారి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళడం కష్టమేనని వినియోగదారులు అంటున్నారు. అయితే ఈ మార్పు అర్థం చేసుకోదగ్గదేననే భావన కూడా వ్యక్తమవుతోంది కొందరిలో. ఓ వ్యాపారి మాట్లాడుతూ ఒకే చోట అన్నీ లభ్యం కావడం వల్ల వ్యాపారం సజావుగా సాగుతుందనీ, ఒక్కో చోటకి ఒక్కో రకమైన వస్తువల కోసం వినియోగదారులకు వెళ్ళాల్సి వస్తే వ్యాపారం మందగిస్తుందని అన్నారు. సెంట్రల్ మార్కెట్‌లో వినియోగదారులకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, అన్ని రకాలైన తమ అవసరాలూ ఒకే చోట తీరిపోతాయి. అలాగే బల్క్ కొనుగోళ్ళు ఇక్కడ చవకగా జరుగుతాయి. మార్కెట్ మార్పుతో తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఓ వ్యాపారి చెప్పారు. ఇంకో వైపున ఆయా ప్రాంతాల్లో కొత్త మార్కెట్ల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!