మక్కాలో వంటగది గ్యాస్ పేలుడులో ఒకరు మృతి , 14 మందికి గాయాలుమక్కా:
- December 30, 2016
వంటగదిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఒక కార్మికుడు మృతి చెందగా మరో 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.స్థానిక మల్కన్ వ్యాలీ లోని ముస్లిమేతర రోడ్డుపై ఒక ప్రైవేటు రంగ కంపెనీకి చెందిన కార్మికుల బృందం నివసిస్తుంది. ఈ ప్రాంతంలో ఈ గ్యాస్ పేలుడు ఘటన చోటు చేసుకోనుందని " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మక్కా పౌర రక్షణ ప్రతినిధి మేజర్ నైఫ్ అల్ షరీఫ్ గురువారం తెలిపారు. ఈ ప్రమాద సమాచారం పై ఒక నివేదికను పౌర రక్షణ అందుకున్నట్లు ఆయన చెబుతూ, అగ్ని మరియు ప్రమాద నివారణ జట్లను వెంటనే సంఘటనా స్థలానికి పంపినట్లు అల్ షరీఫ్ పేర్కొన్నారు.ఈ గ్యాస్ పేలుడులో గాయపడినవారిని తక్షణమే అంబులెన్స్ అధికారుల సమన్వయంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు పౌర రక్షణ జట్లు సంబంధిత అధికారుల సమన్వయ సహకారంతో సంఘటన కారణాలు కనుక్కొనేందుకు విచారణ ప్రారంభించారు.ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్థానిక పౌరులు మరియు ప్రవాసీయులు గుమిగూడి ఏదో వింత దృశ్యాలు చూసినట్లుగా చూస్తూ గుంపు కట్టవద్దని అల్ షరీఫ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తమ సేవలను వెనువెంటనే బాధితులకు అందించడానికి దారి ఇవ్వాలని తద్వారా విలువైన వారి జీవితాలను రక్షించేందుకు ఏజెన్సీలకు అవకాశం వ్వాలని ఆయన కోరారు. .
తాజా వార్తలు
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!
- యూఏఈలో భారీ వర్షాలు..పబ్లిక్ పార్కులు మూసివేత..!!
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్







