ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం బలాదూర్‌..

- December 30, 2016 , by Maagulf
ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం బలాదూర్‌..

వైకల్యంతో పోరాడటం, ఈ పోరాటంలో తమలో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించడం అభినందించదగ్గది. సాధించాలనే పట్టుదల ఉంటే ఆ పట్టుదల ముందు ఎలాంటి వైకల్యమైనాసరే బలాదూర్‌ అనడానికి జస్సిమ్‌ జనాహి నిదర్శనం. గల్ఫ్‌ పెట్రోకెమికల్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఉద్యోగి జస్సిమ్‌ జనాహి 'స్పార్టాన్‌ రేస్‌ అరేబియా'లో మెడల్‌ని గెలుచుకున్నాడు. ప్రపంచంలోనే అతి క్లిష్టమైన, ఛాలెంజింగ్‌ రేసుల్లో ఇది కూడా ఒకటి. ఇందులో 30 అతి కష్టమైన ఫీట్స్‌ చేయవలసి ఉంటుంది. క్లైంబింగ్‌, క్రాలింగ్‌, ఏమీ తెలియని టెర్రెయిన్‌లో పరిగెత్తడం (వాటర్‌ పూల్స్‌, మడ్‌ ట్రాక్స్‌, బారియర్స్‌, ఫైర్‌ వంటివి) ముఖ్యమైనవి. ఈ మెడల్‌ సాధించిన జస్సిమ్‌ జనాహికి అభినందనలు తెలియజేస్తూ జిపిఐసి ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ రహమాన్‌ జవహరి, తమ ఉద్యోగుల్ని ఇలాంటి పోటీలవైపు నడిపించడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రత్యేకావసరాలు కలిగిన (వైకల్యంతో బాధపడుతున్న) జస్సిమ్‌ జానమి సాధించిన ఈ విజయం అపురూపమైనదనీ, బహ్రెయిన్‌ జెండాని గర్వంగా ఎగరవేసినందుకుగాను ఆయన్ని అభినందిస్తున్నామని చెప్పారాయన. ఆత్మవిశ్వాసంతో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోంచి అయినా విజేతగా నిలవవచ్చని నిరూపించిన జస్సిమ్‌ ది గ్రేట్‌ అని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com