బాణాసంచా పేలుడు లో 10 మంది మృతి..
- December 30, 2016
నెల్లూరు జిల్లా కేంద్రం శివారులోని పొర్లుకట్ల సమీపంలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 10 మంది సజీవ దహనమయ్యారు.. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని 108 వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పలువురి శరీరం పూర్తిగా కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో సహాయచర్యలు చేపట్టేందుకు ఆటంకంగా మారింది.
పొర్లుకట్ట.. బాణాసంచా తయారీకి అడ్డా
నెల్లూరు నగర శివారులోని పొర్లుకట్ల బాణాసంచా తయారీకి ప్రసిద్ధి చెందింది. జిల్లావ్యాప్తంగా ఇక్కడి నుంచే బాణాసంచా ఎగుమతి చేస్తుంటారు. సీజన్లతో సంబంధం లేకుండా సంవత్సరమంతా ఇక్కడ బాణాసంచా తయారుచేస్తుంటారు. ఇక్కడి బాణాసంచా తయారీ కేంద్రాల్లో చాలావాటికి కనీస అనుమతులు లేనట్లు సమాచారం. పోలీసులు అప్పుడప్పుడూ దాడులు చేయడం తప్ప.. కేసులు పెట్టిన దాఖలాలు కూడా లేనట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







