టర్కీ నైట్ క్లబ్ దాడిలో 8మంది అరెస్ట్
- January 02, 2017
నైట్ క్లబ్ ఉగ్రదాడిలో ఎనిమిది మంది అనుమానితులను టర్కీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రీనా నైట్ క్లబ్ లోకి దూసుకువచ్చిన ఆగంతకుడు 39 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. దాడిని తామే జరిపినట్లు ఐసిస్ ప్రకటించింది. కాల్పుల అనంతరం దుండగుడు ఉజ్బెకిస్ధాన్ లేదా కజకిస్ధాన్ కు పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
టర్కీలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇరాక్ లోని 103 ఐసిస్ స్ధావరాలపై సేనలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 22మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు టర్కీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ తెలిపారు. ఉగ్రదాడిలో మరణించిన వారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. అయితే, క్లబ్ కు కూతవేటు దూరంలో పోలీసు స్టేషన్ ఉన్నా కాల్పుల అనంతరం దుండగుడు ఎలా పరారయ్యాడు అనే విషయంపై మాత్రం టర్కీ ప్రభుత్వం ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.కాల్పుల అనంతరం తుపాకీని పారేసిన దుండగుడు జన సమూహంలో కలిసిపోయి తప్పించుకున్నట్లు ఓ రిపోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్లో ‘ఇత్కాన్’ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







