పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణా అనుకూలం : కే సి అర్
- September 09, 2015
చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన కొనసాగుతోంది. డలియన్ సిటీలో బుధవారం ఆయన ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ప్రసంగించడంతో పాటు పలువురు ప్రముఖులను కలిశారు. ఆర్దిక వేదిక చైర్మన్ క్లాజ్ శ్వాబ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రత్యేకతను ఆయనకు వివరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ సామాజిక, ఆర్ధిక విషయాలను ఆయనతో పంచుకున్నారు. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ వివరాలను అందించారు. తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమని స్పష్టం చేసారు. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు తీసుకొచ్చిన సింగిల్ విండో సిస్టం గురించి తెలిపారు. ప్రపంచంలో మాదే అత్యున్నత పారిశ్రామిక విధానం : కేసీఆర్ ప్రపంచంలో తమది అత్యున్నత పారిశ్రామిక విధానమని కేసీఆర్ అన్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే 12 వేల కోట్ల పెట్టుబడులతో 52 పరిశ్రమలకు అనుమతులిచ్చిన సంగతిని గుర్తు చేశారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులిస్తామన్నారు. ఆర్ధిక వేదిక వచ్చే సమావేశాలను తెలంగాణలో నిర్వహించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. సీఎం ప్రతిపాదన పట్ల క్లాజ్ తో పాటు వేదిక నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. దాంతో పాటు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని పొగిడారు క్లాజ్. తెలంగాణ లో చేపట్టిన సంక్షేమ, ఆర్థిక విధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా ఉప ప్రధానితో ప్రత్యేకంగా ప్రత్యేకంగా చర్చలు అనంతరం మంగోలియా ప్రధాని, చైనా ఐటీ శాఖ మంత్రి, రష్యా ఉప ప్రధానితో సీఎం ప్రత్యేకంగా చర్చలు జరిపారు. తన ప్రసంగంలో హైదరాబాద్ అభివృద్ధిపై తన విజన్ గురించి వివరించారు. నగర అభివృద్ది నమూనాపై తన అనుభవాలు , అభిప్రాయాలను ఇతర నగరాల మేయర్లు, వైస్ మేయర్లతో పంచుకున్నారు. తెలంగాణ నగర అభివృద్దికి సలహాలు, సూచనలు కోరారు. మొత్తానికి సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోందని ప్రభుత్వ వర్గాలు, పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







