సలామ్ ఎయిర్ టిక్కెట్ సేల్స్ ప్రారంభం ..
- January 03, 2017
ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్ టిక్కెట్ సేల్స్‌ని ప్రారంభించింది. సలాలా మరియు మస్కట్ మధ్య ప్రయాణానికిగాను టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. జనవరి 30న విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. మస్కట్ - దుబాయ్ మధ్య విమానాలు ఫిబ్రవరి మధ్యలో ప్రారంభం కానున్నాయి. సలామ్ ఎయిర్ వెబ్సైట్ ద్వారా, అలాగే పలు ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా టిక్కెట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. సలామ్ ఎయిర్ ఛైర్మన్ ఖాలిద్ అల్ యహ్మాది మాట్లాడుతూ, సలామ్ ఎయిర్ టిక్కెట్ల అమ్మకాల్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఒమన్ అభివృద్ధిలో తమ సంస్థ కూడా భాగం పంచుకుంటుందని ఆయన చెప్పారు. సలామ్ ఎయిర్ చీఫ్ ఫ్రాంకోయిస్ బౌటెల్లిర్ మాట్లాడుతూ, అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణాన్ని తాము అందుబాటులోకి తెచ్చామని, ముందు ముందు మరిన్ని ఆకర్షణీయంగా తమ సర్వీసుల్ని ప్రయాణీకులకు అందజేస్తామని వెల్లడించారు. లైట్, ఫ్రెండ్లీ మరియు ఫ్లెక్సీ అనే మూడు ఆప్షన్స్‌ని సలామ్ ఎయిర్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. లగేజ్‌కి అనుగుణంగా ఈ ప్యాకేజీలు ఉంటాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







