సలామ్‌ ఎయిర్‌ టిక్కెట్‌ సేల్స్‌ ప్రారంభం ..

- January 03, 2017 , by Maagulf
సలామ్‌ ఎయిర్‌ టిక్కెట్‌ సేల్స్‌ ప్రారంభం ..

ఒమన్‌ తొలి బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ సలామ్‌ ఎయిర్‌ టిక్కెట్‌ సేల్స్‌ని ప్రారంభించింది. సలాలా మరియు మస్కట్‌ మధ్య ప్రయాణానికిగాను టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. జనవరి 30న విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. మస్కట్‌ - దుబాయ్‌ మధ్య విమానాలు ఫిబ్రవరి మధ్యలో ప్రారంభం కానున్నాయి. సలామ్‌ ఎయిర్‌ వెబ్‌సైట్‌ ద్వారా, అలాగే పలు ట్రావెల్‌ ఏజెంట్స్‌ ద్వారా టిక్కెట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. సలామ్‌ ఎయిర్‌ ఛైర్మన్‌ ఖాలిద్‌ అల్‌ యహ్మాది మాట్లాడుతూ, సలామ్‌ ఎయిర్‌ టిక్కెట్ల అమ్మకాల్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఒమన్‌ అభివృద్ధిలో తమ సంస్థ కూడా భాగం పంచుకుంటుందని ఆయన చెప్పారు. సలామ్‌ ఎయిర్‌ చీఫ్‌ ఫ్రాంకోయిస్‌ బౌటెల్లిర్‌ మాట్లాడుతూ, అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణాన్ని తాము అందుబాటులోకి తెచ్చామని, ముందు ముందు మరిన్ని ఆకర్షణీయంగా తమ సర్వీసుల్ని ప్రయాణీకులకు అందజేస్తామని వెల్లడించారు. లైట్‌, ఫ్రెండ్లీ మరియు ఫ్లెక్సీ అనే మూడు ఆప్షన్స్‌ని సలామ్‌ ఎయిర్‌ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. లగేజ్‌కి అనుగుణంగా ఈ ప్యాకేజీలు ఉంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com