వాహనంతో రోడ్డుపై విచిత్ర విన్యాసాలు చేసిన డ్రైవర్ అరెస్ట్..

- January 03, 2017 , by Maagulf
వాహనంతో రోడ్డుపై విచిత్ర విన్యాసాలు చేసిన డ్రైవర్ అరెస్ట్..

స్థానిక ఖలీఫా బిన్ సల్మాన్ జాతీయ రహదారిపై స్టంట్ తరహా విన్యాసాలు చేస్తూ మంగళవారం రాత్రి  డ్రైవింగ్ చేస్తున్న ఒక డ్రైవర్ ను పరిశోధన మరియు ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ వద్ద ట్రాఫిక్ ఆపరేషన్స్ మరియు కంట్రోల్ డైరెక్టరేట్ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఈ డ్రైవర్ చేష్టలను సామాజిక మీడియా ద్వారా ప్రచారం కాబడుతున్న ఒక వీడియో ద్వారా గుర్తించారు. డ్రైవర్ వాహనం అద్దెకు తీసుకొని ఎంతో నిర్లక్ష్యంగా నడుపుతూ ట్రాఫిక్ లో అడ్డదిడ్డంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి  వేగంగా దూసుకుపోతున్న ఆ డ్రైవర్ ను వెంటాడి అదుపులోనికి తీసుకొన్నట్లు ట్రాఫిక్ ఆపరేషన్స్ మరియు కంట్రోల్ డైరెక్టర్  మంగళవారం చెప్పాడు. ట్రాఫిక్ భద్రత ప్రోత్సహించడానికి ఈ తరహా చేష్టలను సహించబోమని ట్రాఫిక్ చట్టాలను  ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని హెచ్చరించారు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని ఆయన డ్రైవర్లు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com