త్వరలో రానున్న ప్యాసింజర్ డ్రోన్.!
- January 04, 2017
డ్రోన్కార్లు కొన్నేళ్లలోనే మార్కెట్లలోకి రానున్నాయి. దాదాపు 1,500 కిలోల బరువుండే ఈ ప్యాసింజర్ డ్రోన్ 2020 నాటికి మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయిల్‌కు చెందిన ఓ కంపెనీ దీనిని రూపొందించింది. ఇది దాదాపు 500 కిలోల బరువును తీసుకొని 185 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. విలువ సుమారు రూ.950కోట్లు ఉండవచ్చు. ఇజ్రాయిల్‌లోని అర్బన్ ఏరోనాటిక్స్ అనే సంస్థ దీనిని తయారు చేస్తోంది. 'ఒక్కసారి వూహించుకోండి.. ఏదైనా విషవాయువులు మీ పట్టణంలో లీకైతే.. ఆటోమేటిక్ డ్రోన్ వచ్చి ప్రజలను రక్షిస్తే ఎలా ఉంటుందో' అని అర్బన్ ఏరోనాటిక్స్ సీఈవో రాఫి యోలీ తెలిపారు. జనావాసాల మధ్య సురక్షితంగా ప్రయాణించే డ్రోన్లను తయారు చేసేందుకు 2001లో ఈ సంస్థను సెంట్రల్ ఇజ్రాయిల్‌లో స్థాపించారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన కొంత పని పూర్తికావాల్సి ఉంది. 'ఎయిర్ మ్యూల్' గా వ్యవహరించే ఈ డ్రోన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రమాణాలను ఇంకా అందుకోవాల్సి ఉంది. దీనిపేరుతో ఇప్పటికే 39 పేటెంట్లు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







